ఛలో ఇటలీ.. విమానమెక్కేసిన ప్రభాస్!
- ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్'
- లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్
- హైదరాబాదులో ఇటలీ వాతావరణంతో సెట్స్
- నిర్ణయం మార్చుకుని ఇటలీకి యూనిట్
కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఇక ఇప్పట్లో అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం దుర్లభం అని భావించిన దర్శక నిర్మాతలు ఇటలీ వాతావరణాన్ని ప్రతిబింబించే వీధులు, హాస్పిటల్, షాపింగ్ మాల్ వంటి సెట్స్ ను హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో వేయడం ప్రారంభించారు. ఈ పనులు జరుగుతుండగానే ఇటలీలో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయన్న వార్తలు రావడంతో, సహజత్వం కోసం మళ్లీ అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
దీంతో ఇప్పటికే వేసిన సెట్స్ ను అలాగే వదిలేసి, ప్రభాస్ సహా చిత్రం యూనిట్ ఇటలీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. త్వరలోనే అక్కడ ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ నిర్వహిస్తారని అంటున్నారు.