బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన రియా, షోవిక్
- నేటితో ముగిసిన రియా, షోవిక్ కస్టడీ
- కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించిన స్థానిక కోర్టు
- బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన రియా తరఫు న్యాయవాది
వీరి జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియగా, స్థానిక న్యాయస్థానం ఆ కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.
డ్రగ్స్ అభియోగాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. సుశాంత్ కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్ లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని ఎన్సీబీ భావిస్తోంది. ఈ కేసులో వరుసగా మూడ్రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది.