Nara Lokesh: 'ఓటేసిన వారినే కాటేస్తున్నారు వైఎస్ జగన్' అంటూ ఓ యువకుడి మృతదేహం ఫొటోను పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.  వైసీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా కందూరు గ్రామంలో ఓం ప్రకాశ్ అనే యువకుడు చనిపోయాడని ఆయన ఆరోపించారు. ఆయన మృతిపై విచారణ చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

'ఓటేసిన వారినే కాటేస్తున్నారు వైఎస్ జగన్. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాశ్‌ని బలితీసుకున్నారు' అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.

'చంపేస్తాం అంటూ వైకాపా నాయకులు, బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రకాశ్ అనే యువకుడు చనిపోయాడు. ఓం ప్రకాశ్ మృతి పై విచారణ చేపట్టాలి' అని లోకేశ్ చెప్పారు.
 
'ఈ ఘటన వెనుక ఉన్న వైకాపా ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలి. దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా? దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

                     
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News