ఇటువంటి సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడం ఏమిటి?: టీడీపీ నాయకురాలు అనిత
- కరోనాను ఎదుర్కోవడం ప్రభుత్వానికి చేత కాలేదు
- తుగ్లక్ చేష్టలతో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
- సెల్ ఫోన్లు ఇచ్చి ఆన్ లైన్ లో విద్యా బోధన చేయొచ్చు కదా?
ఏపీలో ప్రతి 100 మందిలో 15 మంది కరోనా వైరస్ కు గురయ్యారని అనిత అన్నారు. పిల్లలపై అంత ప్రేమ ఉంటే అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చి ఆన్ లైన్లో విద్యా బోధన చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రచార యావ ఎక్కువైందని... స్కూలు బ్యాగులకు పార్టీ రంగులు వేయాలనేదే ప్రభుత్వ ఆలోచన అని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.