Chandrababu: ఇలాంటి స్కామ్‌లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయి.. సీఎస్‌కి లేఖ రాశాను: చంద్రబాబు

chandrababu slams ap govt writes letter to cs
షార్ట్స్‌లో చూడండి
పేదలకు ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు గుప్పించారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తాను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశానని చెప్పారు.

'పేరుకు పేదలకు ఇళ్ల స్థలాల పథకం.. కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను ఎకరా రూ.5  లక్షలు చేయని ఆవభూములను ఎకరా రూ.45 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు తమ కమీషన్లను కోట్లలో దండుకున్నారు' అని చంద్రబాబు చెప్పారు.

'ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయి. ఈ పథకం పేదల కోసమా? ప్రజాధనాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టే పథకమా? అందుకే ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాను' అని చంద్రబాబు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News