Nara Lokesh: వైసీపీ కార్య‌క‌ర్త‌లు మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు చేస్తున్నారు: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతోన్న బెంగళూరు యువతిపై శంషాబాద్‌లో అత్యాచార యత్నం జరిగిందని వచ్చిన ఓ వార్తకు సంబంధించిన వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేశారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఉక్రెయిన్‌ నుంచి ఆమె శంషాబాద్ చేరుకుని, హోటల్‌లో ఉండగా ఆమెపై ప్రవీణ్, సురేందర్ కుమార్, విజయ్‌ కుమార్ అనే ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారని అందులో ఉంది. ఆ యువకులు సీఎం జగన్ మద్దతుదారులని పేర్కొంటూ ఉన్న వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు. ‌

'కార్య‌రూపం దాల్చ‌ని దిశ‌చ‌ట్టం తెచ్చారంటూ ఒకవైపు పాలాభిషేకాలు.. మరోవైపు కామంతో క‌ళ్లు మూసుకుపోయిన నాయకులు.. కార్య‌క‌ర్త‌లేమో మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు, అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌టం మ‌రోవైపు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వైకాపా వారసులపై చర్యలెక్కడ జగన్ గారు?' అని లోకేశ్ ప్రశ్నించారు. నిందితుల్లో ఒకరు గతంలో జగన్‌తో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటో ఒకటి లోకేశ్ చేసిన పోస్టులో ఉంది.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News