అమెరికా, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో అయోధ్య భూమిపూజ ప్రత్యక్షప్రసారం.. పూర్తి వివరాలు!
- ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లలో లైవ్ టెలికాస్ట్
- ముస్లిం దేశాలలో సైతం ప్రత్యక్షప్రసారం
- ఇండియాలో లైవ్ ఇచ్చిన దాదాపు 200 మీడియా సంస్థలు
వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినట్టు సమాచారం. ఒక్క ఇండియాలోనే ఈ కార్యక్రమాన్ని 200 మీడియా సంస్థలు లైవ్ ప్రసారం చేశాయి. ఏఎన్ఐ ద్వారా దాదాపు 1200 స్టేషన్లకు ఫీడ్ ను పంపిణీ చేశారు. ఏపీటీఎన్ ద్వారా మరో 450 మీడియా సంస్థలకు పంపించారు. ఏసియా పసిఫిక్ దేశాలతో దూరదర్శన్ ఈ కార్యక్రమాన్ని పంచుకుంది.