ప్రభాస్ తాజా చిత్రంలో రానా గెస్ట్ అప్పీయరెన్స్?
- రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం
- రెండు నిమిషాల గెస్ట్ పాత్రలో రానా
- హైదరాబాదులో ఆసుపత్రి, యూరప్ సెట్
- ఆగస్టు నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగ్
ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగును లాక్ డౌన్ కు ముందు ఇటలీ, జార్జియాలలో నిర్వహించారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో తదుపరి షూటింగును హైదరాబాదులోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం స్టూడియోలలో పెద్ద ఆసుపత్రి సెట్ ను, యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ ను, ఓ భారీ ఓడ సెట్ ను వేస్తున్నారు. ఈ పనులు పూర్తికావడానికి నెల రోజుల సమయం పడుతుందని, ఆగస్టు నుంచి షూటింగ్ మొదలెడతామని చిత్రం యూనిట్ చెబుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.