నితిన్ సరసన కీర్తి సురేశ్ కి మరో ఛాన్స్!
- నితిన్ తో 'రంగ్ దే' సినిమాలో కీర్తి
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట'
- రషెస్ చూసి కీర్తిని ఎంచుకున్న దర్శకుడు
కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 'పవర్ పేట' అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఇది నితిన్ కెరీర్ లోనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమా అని అంటున్నారు. ఇందులో కథానాయికగా తాజాగా కీర్తి సురేశ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కృష్ణ చైతన్య 'రంగ్ దే' రషెస్ చూసి, తన సినిమాలోని పాత్రకు కీర్తి అయితేనే బాగుంటుందని నిర్ణయించుకుని ఆమెను ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు.