వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో మలయాళ నటి మియా నిశ్చితార్థం

Malayalam Actress Miya George got engaged with Ashwin Philip
  • నిన్న ఫిలిప్ ఇంట్లో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్థం
  • సెప్టెంబరులో వివాహం
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన నటి
వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో మలయాళ నటి మియా జార్జ్ నిశ్చితార్థం జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో కేరళలోని ఫిలిప్ నివాసంలో నిన్న మియా, ఫిలిప్ ఉంగరాలు మార్చుకున్నారు. మియా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఫిలిప్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్నట్టు సమాచారం. టీవీ నటిగా కెరియర్ ప్రారంభించిన మియా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2014లో ‘అమరకావ్యం’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోనూ కాలుమోపింది. ప్రస్తుతం ప్రముఖ నటుడు విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో నటిస్తోంది.
Go Back to Shorts
Malayalam
Actress Miya George
Engagement

More Telugu News