ఆసక్తిని రేపుతున్న 'లూజర్' ట్రైలర్
- అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మించిన వెబ్ సిరీస్
- ముగ్గురు క్రీడా కారుల చుట్టూ తిరిగే కథ
- ఎమోషన్స్ ప్రధానంగా నడిచే పాత్రలు
ముగ్గురు క్రీడాకారుల జీవితాలు ఏ కారణంగా ఎలాంటి మలుపులు తిరిగాయి? ఎలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కలుసుకున్నారు? ఆ తరువాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ నిర్మితమైంది. సహజత్వానికి దగ్గరగా పాత్రలను మలిచినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'ఓడిపోవడమంటే దారులు లేకపోవడం కాదు .. ఉన్న దారిని వెతుక్కోలేకపోవడం' .. ' పైసల విలువ ఎంత ఖర్చు పెడుతున్నామనే దాంట్లో వుండదురా .. ఎందుకు ఖర్చు పెడుతున్నామనేదాంట్లో ఉంటది' అనే డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.