'దాసరి' అనే పదంలోని అక్షరాలను విపులీకరించిన చిరంజీవి!
- నేడు దాసరి నారాయణరావు జయంతి
- దర్శక దిగ్గజాన్ని స్మరించుకుంటున్న చిత్ర పరిశ్రమ
- దాసరి స్ఫూర్తి సజీవంగా ఉంటుందన్న చిరంజీవి
దా...దానంలో కర్ణుడు మీరు
స... సమర్థతలో అర్జునుడు మీరు
రి... రిపువర్గమే లేని ధర్మరాజు మీరు... అంటూ దాసరిని కీర్తించారు.
మీరు మా మధ్య లేకపోయినా మీరందించిన స్ఫూర్తి మాత్రం ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుందని, ప్రతి భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకత్వం అవుతుందని తెలిపారు. అంతేకాదు, దాసరిని తాను చివరిగా కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. గురువుగారితో ఇదే చివరి జ్ఞాపకం అని భావోద్వేగాలతో కూడిన ట్వీట్ చేశారు.