ఇంటి పైనుంచి దూకేస్తానేమోనని అనుక్షణం గమనిస్తుండేవారు: షమీ
- తన కెరీర్ లో దుర్దశ గురించి చెప్పిన షమీ
- 2015 వరల్డ్ కప్ తర్వాత గాయపడినట్టు వెల్లడి
- వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య ఆలోచన చేశానని వివరణ
కోల్ కతాలో తన నివాసం ఓ భారీ అపార్ట్ మెంట్ లో 24వ అంతస్తులో ఉండేదని, నిత్యం బాధపడుతూ ఉండే తాను ఎక్కడ కిందికి దూకేస్తానో అని కుటుంబ సభ్యులు అనుక్షణం గమనిస్తుండేవారని షమీ వెల్లడించాడు. "కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నా వెన్నంటే ఉండేవారు. వారు ఆ విధంగా మద్దతు ఇవ్వకపోయుంటే నేను ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండేవాడ్ని" అంటూ భావోద్వేగాలకు లోనయ్యాడు.