'విరూపాక్ష'కి సంబంధించి అదంతా పుకారే
- క్రిష్ నుంచి మరో చారిత్రక చిత్రం
- శివకార్తికేయన్ ను సంప్రదించలేదట
- జాక్విలిన్ కూడా క్లారిటీ ఇచ్చేసింది
ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి శివ కార్తికేయన్ ను ఎవరూ సంప్రదించలేదనీ, ఆయన ఈ సినిమా చేయడం లేదని అతని పీఆర్ టీమ్ చెప్పింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో శివకార్తికేయన్ బిజీగా వున్నాడని చెప్పింది. ఇక ఈ సినిమాలో ఒక కథానాయియికగా జాక్విలిన్ ను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె కూడా తెలుగులో తను ఏ సినిమాను కమిట్ కాలేదని క్లారిటీ ఇచ్చింది.