gas: దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన వంట గ్యాస్‌ ధర

Non Subsidised LPG Price Cut By Up To Rs 192 Per Cylinder In Metros
షార్ట్స్‌లో చూడండి
దేశంలో వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర భారీగా తగ్గింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై మెట్రో నగరాల్లో రూ.192 వరకు తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) ఈ రోజు ప్రకటించింది. మూడు నెలల్లో వరుసగా మూడోసారి గ్యాస్ ధరలు తగ్గాయి. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.162.50 తగ్గిస్తున్నట్లు ఐఓసీ పేర్కొంది. ముంబైలో రూ.135.50 తగ్గిస్తున్నట్లు వివరించింది.

 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.744గా ఉండగా, ఇప్పుడు రూ.581.50 అయింది. కోల్‌కతాలో నిన్నటి వరకు 774.50గా ఉన్న సిలెండర్ ధర ఇప్పుడు రూ.584.50కి తగ్గింది. ముంబైలో నిన్నటి వరకు 714.50 ఉన్న ధర ఇప్పుడు 579 రూపాయలు అయింది. చెన్నైలో నిన్నటి వరకు 761.50గా ఉన్న ధర ఇప్పుడు 569.50గా ఉంది. మూడు నెలల నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో సిలెండర్ ధర మొత్తం రూ.277 తగ్గింది.
Go Back to Shorts
gas
India
Cylinder

More Telugu News