బన్నీతో స్టెప్పులు వేయనున్న దిశా పటాని?
- 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయం
- హిందీ సినిమాలతో బిజీ
- సుకుమార్ సినిమా కోసం సంప్రదింపులు
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు. ఇక ఐటమ్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. సుకుమార్ .. దేవిశ్రీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ దుమ్మురేపేశాయి. అలాగే ఈ సినిమాలోను మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో బన్నీతో కలిసి దిశా పటాని మెరవనుందని అంటున్నారు.