ఆరోగ్య సేతు యాప్ ఉండాల్సిందే... డౌన్ లోడ్ ను తప్పనిసరి చేసిన జొమాటో
- దేశంలో కరోనా వ్యాప్తి
- ఫుడ్ డెలివరీ సంస్థలపై రాష్ట్రాల అసంతృప్తి
- తన భాగస్వాములకు ఆరోగ్యసేతు యాప్ పై స్పష్టతనిచ్చిన జొమాటో
తమతో భాగస్వామ్యం కలిగివున్న ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు అందరూ ఆరోగ్య సేతు యాప్ ను కలిగి ఉండాలని, విధిగా వాడాలని, ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి తమ భాగస్వాముల వద్దకు వస్తే ఆరోగ్య సేతు యాప్ హెచ్చరిస్తుందని, తద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.