Chandrababu: జగన్ తో పాటు అందరికీ ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

  • నేడు  చంద్రబాబు 70వ పుట్టినరోజు 
  • శుభాకాంక్షలు తెలిపిన గడ్కరీ, జగన్, చిరంజీవి తదితరులు
  • కరోనా కారణంగా వేడుకలను జరుపుకోని చంద్రబాబు
Chandrababu thanks all including Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్, సినీ నటుడు చిరంజీవి, సింగర్ స్మితతో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, కరోనా  మహమ్మారి కారణంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేదు.

More Telugu News