Lawrence: లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2'

  • రజనీ హీరోగా హిట్ కొట్టిన 'చంద్రముఖి'
  • సీక్వెల్ ను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు 
Chandramukhi 2 Movie

తమిళంలో రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన 'చంద్రముఖి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. రజనీకాంత్ కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాకి 'చంద్రముఖి 2' టైటిల్ తో సీక్వెల్ చేయాలని దర్శకుడు పి.వాసు కొంతకాలంగా ప్రయత్నిస్తూనే వున్నాడు. అయితే రజనీకాంత్ మాత్రం పెద్దగా ఆసక్తిని చూపలేదు.

ఈ నేపథ్యంలో వాసు .. లారెన్స్ కథానాయకుడిగా ఈ సీక్వెల్ చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా తెలియజేశాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా చెప్పాడు. హారర్ కామెడీ సినిమాలు చేయడంలో లారెన్స్ కి మంచి అనుభవం వుంది. 'కాంచన' .. 'గంగ' .. 'శివలింగ' చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. లారెన్స్ చేయనున్న 'చంద్రముఖి 2' కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News