బన్నీ ప్రత్యేక దృష్టి .. పాన్ ఇండియా మూవీగానే 'ఐకాన్'

Icon Movie
  • 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ 
  • తదుపరి సినిమాగా 'ఐకాన్'
  • ఇతర భాషల్లోను విడుదల చేసే ఛాన్స్
అల్లు అర్జున్ .. సుకుమార్  కాంబినేషన్లో 'పుష్ప' రూపొందనుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ .. 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. నిజానికి సుకుమార్ సినిమాకంటే ముందే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' చేయడానికి బన్నీ అంగీకరించాడు. 'దిల్' రాజు నిర్మాణంలో పనులు మొదలయ్యాయి కూడా.

ఈ లోగా సుకుమార్ రావడంతో బన్నీ ఆ ప్రాజెక్టును ముందుకు తెచ్చాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఐకాన్' చేస్తాననే 'దిల్' రాజుతో చెప్పాడట. పాన్ ఇండియా మూవీకి తగినట్టుగా కథలో మార్పులు చేయమని సూచించాడని అంటున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. దీనిని బట్టీ 'ఐకాన్' సినిమా కూడా భారీ బడ్జెట్లోనే ఉంటుందనీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల కానుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Allu Arjun
Dil Raju
Venu Sriram

More Telugu News