ఆ దళిత డాక్టర్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలి: వర్ల రామయ్య డిమాండ్
- నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టరును సస్పెండ్ చేయడం తగదు
- ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్నారు
- అటువంటి వారి శ్రమను కించపరచొద్దు
లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ హాస్టల్లో వుండే లక్షలాది మంది పేద విద్యార్థులను ఇరవై రోజుల క్రితం వారి వారి ఇళ్లకు ప్రభుత్వం పంపిన విషయాన్ని గుర్తుచేస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ పేద విద్యార్థుల ఆహారం గురించి విస్మరించడం శోచనీయమని, లక్షలాది మంది బడుగు వర్గాల బిడ్డలు తలిదండ్రులకు భారమైన స్థితిని గమనించి ఆదుకోవాలని సీఎం జగన్ కు ఓ సూచన చేశారు.