Allu Arjun: మళ్లీ వెలుగులోకి వచ్చిన బన్నీ 'ఐకాన్'!

  • వేణు శ్రీరామ్ కి ఓకే చెప్పిన బన్నీ 
  • సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం 
  • ప్రాజెక్టు ఆగిపోలేదనే సంకేతం
Venu Sriram Movie

అల్లు అర్జున్ .. దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకున్నాడు. ఆ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'దిల్' రాజు నిర్మాతగా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండగా, త్రివిక్రమ్ తో 'అల వైకుంఠపురములో' ప్రాజెక్ట్ సెట్ అయింది. ఆ సినిమా విడుదలైన తరువాత సుకుమార్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో 'ఐకాన్' ఊసే లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు వుంది .. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ, బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని  దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ .. పవన్ తో 'వకీల్ సాబ్' చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత బన్నీ ప్రాజెక్టుపైకి వస్తాడు..

More Telugu News