దర్శకుడు సుకుమార్ మేనేజర్ ప్రసాద్ కన్నుమూత!
- గుండెపోటుతో కన్నుమూసిన ప్రసాద్
- ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు
- కన్నీరు పెట్టుకున్న సుకుమార్
ప్రసాద్ నిర్మాతగా మారి 'అమరం అఖిలం ప్రేమ' అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు కాస్తంత నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్ ధైర్యం చెప్పేవారని, ఆయనతో కాసేపు మాట్లాడగానే తనకెంతో ఎనర్జీ వచ్చేదని అన్నారు. ప్రసాద్ మృతి తనకెంతో లోటని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సుకుమార్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రసాద్ కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖులు సానుభూతి తెలియజేశారు.