ఈ నెంబర్లకు ఫోన్ చేసి.. ఉచిత వైద్య సదుపాయం పొందండి: కేశినేని నాని
- రతన్ టాటాగారితో కలిసి 21 టెలి మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశాం
- ఈ సెంటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయి
- ఎవరికి ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
'విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం రతన్ టాటాగారితో కలిసి నేను ఏర్పాటు చేసినటువంటి 21 టెలి మెడిసిన్ సెంటర్లు ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాయి. కావున ఎవరికి ఏ ఇబ్బంది వున్నా మీకు దగ్గరలో ఉన్న సెంటర్ కి ఫోన్ చేసిన యెడల మీకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది' అని కేశినేని నాని తెలిపారు. దీంతో పాటు టెలి మెడిసిన్ సెంటర్లు, వాటి ఫోన్ నెంబర్లను షేర్ చేశారు. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.