Nara Lokesh: ఈ ఐదు సూత్రాలు కచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని అరికడదాం: నారా లోకేశ్

Nara Lokesh says we can avoid corona with these five measures
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా నివారణ చర్యలను ట్విట్టర్ లో వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియో చివర్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సందేశాన్ని కూడా జతచేశారు.

లోకేశ్ చెప్పిన ఐదు సూత్రాలు ఇవే...
  •  వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి.
  • తరచుగా చేతులను కడుగుతూ ఉండండి.
  • దగ్గినా, తుమ్మినా మీ చేతులను తప్పనిసరిగా అడ్డుపెట్టుకోండి.
  • ముఖాన్ని అసలు ముట్టుకోవద్దు.
  • సామాజిక దూరం కచ్చితంగా పాటించండి.
ఈ ఐదు సూత్రాలను పాటించడం ద్వారా కరోనాను ఆమడదూరంలో ఉంచొచ్చని నారా లోకేశ్ తెలిపారు. కాగా, కరోనా విజృంభణతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. జనజీవనం కూడా బాగా మందగించింది.
Go Back to Shorts
Nara Lokesh
Corona Virus
Measures
Andhra Pradesh
Lockdown

More Telugu News