'జర్నీ' తరువాత మరో తమిళ సినిమా చేస్తున్న శర్వానంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జర్నీ' తరువాత మరో తమిళ సినిమా చేస్తున్న శర్వానంద్

Raju Sundaram Movie
  • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే శర్వానంద్ 
  • గతంలో తమిళంలో చేసిన 'జర్నీ' హిట్ 
  •  రాజు సుందరం దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్
కథ కొత్తగా ఉండాలి .. కథనం కొత్తగా ఉండాలి .. తన పాత్ర వైవిధ్యభరితంగా ఉండాలి. అప్పుడే శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. దాంతో ఆయన కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆయన మరో తమిళ సినిమా అంగీకరించడం విశేషం. డాన్స్ మాస్టర్  రాజు సుందరం దర్శకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా తమిళంలో నిర్మితం కానుంది. 'జర్నీ' తరువాత తమిళంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఇది. మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Sharwanand
Journey Movie
Raju Sundaram Movie

More Telugu News