Rajanikanth: లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్!

  • రజనీ తదుపరి చిత్రంగా 'అన్నాత్తే'
  • లారెన్స్ పట్ల రజనీకి అభిమానం 
  • ప్రాజెక్ట్ సెట్ చేసిన లారెన్స్ 
Lawrence Raghava Movie

ఈ మధ్య కాలంలో యువ దర్శకులకు అవకాశాలనిస్తూ, వరుస సినిమాలతో రజనీకాంత్ దూసుకుపోతున్నాడు. 'కబాలి' .. 'కాలా' .. 'పేట' సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాయి. గెటప్స్ పరంగా ఈ మూడు సినిమాలు కొత్త రజనీకాంత్ ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ఆయన తన 168వ సినిమాను శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'అన్నాత్తే' టైటిల్ తో ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఆ తరువాత సినిమాను ఆయన లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నాడనేది కోలీవుడ్ టాక్. మొదటి నుంచి కూడా రజనీకాంత్ కి లారెన్స్ వీరాభిమాని. ఎన్నో వేదికలపై ఆయన రజనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రజనీకి కూడా లారెన్స్ పట్ల ఎంతో అభిమానం వుంది. ఈ కారణంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఓకే అయిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News