Budda Venkanna: జగన్‌ తన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?: బుద్ధా వెంకన్న

budda venkanna criticises vijay sai reddy and jagan
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'పారాసిటిమల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందని వైఎస్ జగన్‌ గారు సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?' అని ప్రశ్నించారు.

'అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా?' అని నిలదీశారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News