ఉగాది రోజునే మహేశ్ బాబు మూవీకి ముహూర్తం?
- వంశీ పైడిపల్లితో ప్రాజెక్టు వాయిదా
- రంగంలోకి దిగిన పరశురామ్
- ఉగాదికి లాంచ్ చేసే అవకాశం
ఉగాది రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించి, లాంఛనంగా షూటింగును మొదలెట్టే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రోజునే ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు తెలిసే అవకాశం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి భారీ విజయం తరువాత పరశురామ్ చేస్తోన్న సినిమా కావడంతో, అందరిలో ఆసక్తి పెరుగుతోంది.