ఆస్ట్రేలియా షూటింగును రద్దు చేసుకున్న ప్రభాస్ టీమ్?
- ప్రభాస్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్
- తొలిసారి ప్రభాస్ జోడీ కడుతున్న పూజా హెగ్డే
- హైదరాబాద్ లోనే జరగనున్న షూటింగ్
అయితే 'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ సమయంలో అక్కడికి వెళ్లే ఆలోచనను ఈ సినిమా టీమ్ విరమించుకున్నట్టుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియా షెడ్యూల్ కోసం మరింత కాలయాపన చేయకుండా, హైదరాబాద్ లోనే సెట్స్ వేసి, ఆ షెడ్యూల్ ను కూడా ఇక్కడే చిత్రీకరించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలెట్టారనే అంటున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.