టాలీవుడ్ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూత

  • అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరాజు
  • చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన నిర్మాత
  • గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై చిత్ర నిర్మాణం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరాజు చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పవిత్రబంధం, ఘర్షణ, పెళ్లిచేసుకుందాం, శ్రీమతీ వెళ్లొస్తా సహా 16 చిత్రాలకు ఆయన నిర్మాత. అంతేకాదు, పలు చిత్రాలకు ప్రొడక్షన్ విభాగంలోనూ పనిచేశారు. కాగా, వెంకటరాజు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అంత్యక్రియలు రేపు చెన్నైలో నిర్వహించనున్నారు.
Go Back to Shorts
C.Venkataraju
Tollywood
Producer
chennai

More Telugu News