ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ: విజయసాయిరెడ్డి
- రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు
- బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ భరోసా ఇచ్చారు
- 59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు
- బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమే కదా
'రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. ఏటా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా సీఎం జగన్ గారు వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.