'దిశ' కావాలంటున్న ఏపీ యువతులు... 4.9 స్టార్ రేటింగ్ తో ఫుల్ డౌన్ లోడ్స్!
- నాలుగు రోజుల క్రితం విడుదలైన యాప్
- 50 వేలకు పైగా డౌన్ లోడ్లు
- యాప్ ను పరీక్షిస్తున్న యువతులు
కాగా, ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు సగటున రోజుకు 2 వేలకు పైగా టెస్ట్ కాల్స్ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరీక్షిస్తున్నారని, తాము వెంటనే ప్రతిస్పందిస్తున్నామని అన్నారు. ఆపై వారికి ఇకపై ఇలా చేయవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్నామని అన్నారు.
ఇక, ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత, ఓ భర్త వేధింపుల నుంచి భార్యను కాపాడామని, పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసకు సోదరుడయ్యే వ్యక్తి వేధిస్తుంటే, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఓ బాలిక ఫిర్యాదునూ పరిష్కరించామని ఆమె తెలిపారు.