Ramcharan: హీరో రామ్ చరణ్‌ నటన అద్భుతంగా ఉంటుంది: సుధామూర్తి ప్రశంసల జల్లు

షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత నటించిన తెలుగు సినిమా 'రంగస్థలం'ను తాను చూశానని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి తెలిపారు. ఆ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆ సినిమాలో రామ్‌చరణ్‌ నటన చాలా బాగుందని చెప్పారు. అలాగే, తాను నాగార్జున సినిమా 'మనం' కూడా చూశానని, తాను కన్నడ సినిమాలు కూడా బాగా చూస్తానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

తన బాల్యంలో ఎన్టీ రామారావు సినిమాలు చూసేదానినని సుధామూర్తి తెలిపారు. మాయాబజార్‌, దాన వీర శూర కర్ణతో పాటు పలు సినిమాలను చూశానని చెప్పారు. శ్రీ కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదని, తన దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరేనని ఆమె అన్నారు. కృష్ణుడిని స్మరిస్తే, తనకు ఎన్టీఆర్‌ కనిపిస్తారని తెలిపారు. తాను అన్నమయ్య, భక్త ప్రహ్లాద వంటి సినిమాలను కూడా చూశానని తెలిపారు.

Go Back to Shorts
Ramcharan
Tollywood
Nagarjuna

More Telugu News