Vijay Sai Reddy: చంద్రబాబు నోరు విప్పడం లేదు: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాలని ఎద్దేవా చేశారు. ఈ సోదాలపై రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారని... కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
IT Raids

More Telugu News