కోలుకున్న బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- గత నెల 18న రోడ్డు ప్రమాదంలో గాయపడిన షబానా
- 13 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స
- మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
జనవరి 18న ఆమె ప్రయాణిస్తున్న కారు ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఖాలాపూర్ టోల్‌ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఆమెను నవీ ముంబైలోని మహాత్మాగాంధీ మిషన్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అయితే, మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అంధేరీలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు.