ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ?: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ?: విజయసాయిరెడ్డి

  • దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండని అంటున్నారు
  • రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్ రద్దును సమర్థిస్తామని రంకెలు వేస్తున్నారు
  • దీనికి బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి
  • రిఫరెండంగా భావిస్తాం 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలని చంద్రబాబు విసురుతున్న సవాళ్లకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలని ఆయన సవాలు విసిరారు.

'దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్ రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి. రిఫరెండంగా భావిస్తాం. నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం  తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు. ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

YSRCP
Telugudesam
Vijay Sai Reddy

More Telugu News