ఎన్టీఆర్‌కు వెన్ను పొడిచి అకాల మరణానికి కారకుడైన వారిలో రెండో దోషి ఆయనే: విజయసాయిరెడ్డి
- యనమల రామకృష్ణుడిపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
- పెద్దాయన ఉసురు తగిలింది
- తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు
- ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతున్నాడు
'అప్పట్లో కౌన్సిల్ ను పునరుద్ధరించాలని డా.వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. సీఎం జగన్ గారు కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.