వంశీ పైడిపల్లి తరువాత మళ్లీ అనిల్ రావిపూడితోనే మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వంశీ పైడిపల్లి తరువాత మళ్లీ అనిల్ రావిపూడితోనే మహేశ్ బాబు

  • హిట్ కొట్టిన 'సరిలేరు నీకెవ్వరు'
  • వంశీ పైడిపల్లితో మహేశ్ మూవీ 
  • మహేశ్ నమ్మకాన్ని పెంచిన అనిల్ రావిపూడి
మహేశ్ బాబు తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో వెంటనే మరో సినిమా ఉండేలా చూసుకుంటాడు. ఆయన గత హిట్లు .. ఆ దర్శకుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆ మధ్య 'మహర్షి' హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో కూడా ఆయన మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనతో మరో సినిమా చేస్తానని మహేశ్ బాబు మాట ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడితో మరో సినిమా వుంటుందనే విషయాన్ని మహేశ్ బాబు తన అభిమానులకు చెప్పాడు. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ .. తను వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమా పూర్తయిన తరువాత తమ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. మొత్తానికి అనిల్ రావిపూడి .. మహేశ్ బాబు నుంచి మంచి మార్కులే కొట్టేశాడన్న మాట.
Mahesh Babu
Anil Ravipudi

More Telugu News