బొత్స చెప్పేది ఆయన ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదు: అశ్వనీదత్
- రాజధానిని మారుస్తామని బొత్స అంటున్నారు
- ఆయన ఏం చెబుతారో మనకు సరిగా అర్థం కాదు
- అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ అండగా ఉన్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అంటే రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసేందుకు ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అశ్వనీదత్ అన్నారు. కానీ అవన్నీ వదులుకుని ఆయన ప్రజాజీవితంలోకి వచ్చేశారని చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఆరేళ్ల నుంచి నిలబడ్డారని కొనియాడారు.