రైతుల పోరాటం వృథా కాదు.. త్వరలో నేనూ పోరు బాట పడతా: నారా రోహిత్
- విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారింది
- రాజధానికోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని వెలకట్టలేం
- వారు చేస్తోన్న పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం
రైతులు పెద్ద మనసుతో భూములిచ్చారని.. వారి త్యాగంతోనే అమరావతి రాజధానిగా ప్రాణం పోసుకుందన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారిందన్నారు. ‘రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కవోని దీక్షతో రైతులు ముందడుగు వేస్తున్నారు. వారి పోరాటం వృథా కాదు. త్వరలోనే రైతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటాను’ అని రోహిత్ పేర్కొన్నారు.