‘ప్రతి రోజు పండగే’ దర్శకుడు మారుతికి ప్రత్యేక బహుమతి
- రేంజ్ రోవర్ కారును బహూకరించిన నిర్మాత వంశీ
- అనూహ్య కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాతల అనందం
- 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.32.29 కోట్లు వసూళ్లు
ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన నేపథ్యంలో సహ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ దర్శకుడు మారుతిని ప్రశంసిస్తూ.. ఆయనకు రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. దీంతో మారుతి ఆనందం పట్టలేకపోయారు. వంశీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘ధన్యవాదాలు వంశీ డార్లింగ్, నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతి రోజూ పండగే’ అని తన సందేశంలో పేర్కొన్నారు. కారును స్వీకరిస్తూండగా తీసిన ఫొటోను కూడా మారుతి పోస్ట్ చేశారు.