రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఎవరో తెలుసా?
- దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వినయ్ కుమార్
- వినయ్ కుమార్ కర్ణాటక రంజీ ఆటగాడు
- 412 వికెట్లతో రంజీల్లో టాప్ వికెట్ టేకర్
మిజోరాం జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్ లో వినయ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దాంతో మొత్తం 412 వికెట్లతో రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా అవతరించాడు. ఇప్పటివరకు ఆ రికార్డు పంకజ్ సింగ్ (409) పేరిట ఉంది. అయితే, ఓవరాల్ బౌలర్ల జాబితాలో మాత్రం వినయ్ కుమార్ ఏడోస్థానంలో నిలిచాడు. స్పిన్నర్ రాజీందర్ గోయెల్ 637 వికెట్లతో రంజీ చరిత్రలో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో ఎస్.వెంకట్రాఘవన్ 530 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు.