GN Rao committee: జీఎన్ రావు కమిటీ నివేదిక మంచిదని నమ్ముతున్నాం.. సపోర్టు చేస్తాం: అంబటి రాంబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు కమిటీ సిఫారసులు, సీఎం జగన్  నిర్ణయాన్ని తాము శిరసావహిస్తామని, అది మంచిదని నమ్ముతున్నామని... దానికి సపోర్టు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జీఎన్ రావు నివేదిక ఆధారంగా తమ ప్రాంతానికి కూడా అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పారు.  
Go Back to Shorts
GN Rao committee
cm
Jagan
YSRCP
Ambati

More Telugu News