యాంకర్ అనసూయ నివాసం సహా 23 ప్రాంతాల్లో జీఎస్టీ అధికారుల దాడులు
- హైదరాబాదులో డీజీజీఐ దాడులు
- ప్రముఖుల నివాసాల్లోనూ సోదాలు
- కోట్లాది రూపాయల మేర ట్యాక్స్ ఎగవేసినట్టు ఆరోపణలు
ప్రముఖ యాంకర్, నటి అనసూయ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా, చిట్ ఫండ్ సంస్థలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, పలు ఐటీ కంపెనీలు, నిర్మాణ రంగ సంస్థలు, విదేశీ విద్యా కన్సల్టెన్సీల్లో అధికారులు సోదాలు జరిపారు. కోట్లాది రూపాయల మేర సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులకు దిగారు.