ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే బుగ్గనకు అర్ధం తెలుసా: టీడీపీ నేత అనిత
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న బుగ్గన
- ఖండించిన అనిత
- జగన్ పాలన తుగ్లక్ ను మించిపోయిందని ఎద్దేవా
రాజధాని ప్రాంతంలో ఎంతోమంది భూములు కొంటే, వారందరినీ చంద్రబాబుతో ముడిపెట్టడం దారుణమని అన్నారు. అంతేగాకుండా, సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపైనా అనిత వ్యాఖ్యానించారు. ఒక రాజధానికే డబ్బులు లేవంటోన్న ప్రభుత్వం, మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను మించిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.