కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు ఈ చిట్టి రెడ్డి: విజయసాయి వ్యాఖ్యలకు బుద్ధా కౌంటర్
- ట్విట్టర్ లో లోకేశ్ పై విజయసాయి వ్యాఖ్యలు
- దీటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
- చిట్టి రెడ్డి అంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు
మంగళగిరిలో లోకేశ్ ను ఓడించేందుకు వైఎస్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగాల్సి వచ్చిందని, పెయిడ్ ఆర్టిస్టులు సైతం అక్కడే మకాం వేసి లోకేశ్ ఓటమి కోసం పనిచేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఒక్క మంగళగిరిలోనే వైసీపీ గెలుపు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే వెల్లడించినందుకు ధన్యవాదాలు అంటూ స్పందించారు.