onion: 'హెరిటేజ్‌'లో కిలో ఉల్లిపాయలు రూ.200కు అమ్ముతున్నారు: జగన్

షార్ట్స్‌లో చూడండి
దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కిలో ఉల్లిని రూ.25కే అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో ఉల్లి ధరలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 38,496 క్వింటాళ్ల ఉల్లిని ప్రజలకు అందించామన్నారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తుండడం చూసి తనకు బాధేస్తోందని వ్యాఖ్యానించారు. శవ రాజకీయాలు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటేనని అన్నారు.

'టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ దుకాణాల్లో కిలో ఉల్లిపాయలను రూ.200కు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో మాత్రం రూ.25కే అందజేస్తున్నాం. సామాన్య ప్రజలకు మంచి చేయడంలో ఏ విషయంలోనూ రాజీపడొద్దని మేము ఇప్పటికే అధికారులను ఆదేశించాం. వచ్చే శుక్రవారం నుంచి మార్కెట్‌ యార్డ్‌ల్లోనూ సబ్సిడీ ధరలకు ఉల్లి అందిస్తాం' అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.
Go Back to Shorts
onion
Jagan

More Telugu News