Jagan: హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారు: సీఎం జగన్ ఆరోపణ

షార్ట్స్‌లో చూడండి
దేశంలో కిలో ఉల్లిని కేవలం రూ. 25కే అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అసెంబ్లీలో ఉల్లి ధరలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లిని రూ. 200కు అమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేక ఉల్లి పంటను పొలాల్లోనే రైతులు వదిలేసేవారని చెప్పారు. ఇప్పుడు ఉల్లి మంచి ధరకు అమ్ముడుపోతుండటంతో రైతులకు లాభాలు వస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కల్పించుకుని... ఉల్లి ఎక్కడ దొరుకుతున్నా కొంటూ, సబ్సిడీపై ప్రజలకు తక్కువ ధరకే అందేలా చేస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
Onion

More Telugu News