టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై
- పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా సమర్పణ
- వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానన్న బీద
- మస్తాన్ రావు వైసీపీలో చేరతారని వార్తలు!
ఇటీవల మస్తాన్ రావు వైసీపీలో చేరతారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో టీడీపీకి ఆయన రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత ఊపునిస్తోంది. రేపు ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. తాను వైసీపీలో చేరుతున్న వార్తను మస్తాన్ రావు ఇంకా ధ్రువీకరించలేదు.